టీంఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై జట్టు ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు చేశాడు. తనను అణచివేసేందుకు ప్రయత్నించాడని చెప్పాడు. 2018-2019 సీజన్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి.. విదేశాల్లో భారత్ తరఫున నంబర్ వన్ బౌలర్ అని ప్రశంసించడం తట్టుకోలేకపోయానని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వాపోయాడు.
నేను రవిశాస్త్రిని అమితంగా గౌరవిస్తా. మనలో ఎవరైనా కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడి తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకుంటామని తెలుసు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. అయితే, వ్యక్తిగతంగా కుల్‌దీప్ ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషించా. ఆసీస్‌లో నాకు ఐదు వికెట్లు దక్కకపోయినా అతడికి దక్కాయని ఆనందించా. అదెంత గొప్ప విషయమో నాకు తెలుసు. అది అభినందించాల్సిన విషయం కూడా. అంతకుముందు నేను ఆస్ట్రేలియాలో ఎన్నిసార్లు బౌలింగ్ చేసినా ఎప్పుడూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదు. అందుకే మనస్ఫూర్తిగా అతడి పట్ల సంతోషంగా ఉన్నా” అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా వంటి జట్టుపై ఆడినప్పుడు సిడ్నీ టెస్ట్‌లో ఒక స్పిన్నర్ ఐదు వికెట్లు తీయడం ఎంత కష్టమో కుల్దీప్ యాదవ్‌కు తెలుసునన్నాడు. కానీ రవిశాస్త్రి వ్యాఖ్యలు తనను ఖచ్చితంగా అణచివేస్తున్నాడనిపించింది. రవి శాస్త్రిని గురించి తాను గొప్పగా ఊహించుకున్నా. కానీ ఆ క్షణంలో తనను అణచివేస్తున్నారని అనిపించిందన్నాడు రవిచంద్రన్ అశ్విన్.