‘శ్యామ్ సింగరాయ్’ ప్రచారంలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా నానికి ఈ మధ్య రీమేక్ సినిమాలు చేయడం లేదని ప్రశ్నించగా గతంలో తను చేసిన రెండు రీమేకులు తనకి పాఠం నేర్పడం వలన ఆ వైపు వెళ్లదలచుకోలేదని చెప్పాడు.
రీమేకులు తనకి అంతగా సెట్ కావనే విషయం తనకి అర్థమైపోయిందని అన్నాడు నాని. తాను రీమేక్ సినిమాలు చేయడం కంటే, తన సినిమాలు రీమేక్ అవుతుండటం తనకి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కల్యాణం సినిమాలు రీమేక్‌లే. అలానే నాని ‘జెర్సీ’.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతుంది.
వినూత్న కథతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’లో నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.