ఐపీఎల్​ మెగా వేలానికి డేట్ ఫిక్స్..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?

Date fix for IPL mega auction..do you know somewhere?

0
49

ఐపీఎల్​ 2022 మెగా వేలానికి ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు.

ఈ మెగా ఆక్షన్ యూఏఈలో​ జరుగుతుందని ప్రచారం సాగింది. అయితే కరోనా కారణంగా ఇక్కడే నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కొవిడ్​ పరిస్థితుల వల్ల ఈ మెగా వేలం ప్రక్రియను భారత్​లో నిర్వహిస్తున్నాం. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 7,8 తేదీల్లో జరగుతుంది. బెంగళూరులో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఐపీఎల్​ 2022లో ఈ సారి పది జట్లు పాల్గొననున్నాయి. లక్నో, అహ్మాదాబాద్​ టీమ్స్​ కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఈ మెగా వేలం జరగనుంది. కొత్త జట్లు మినహా పాత టీమ్స్​ అన్నీ​ తాము రిటెయిన్​ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఇటీవలే ప్రకటించాయి.