అగ్రరాజ్యం విలవిల..ఒక్కరోజే ఎన్ని కొత్త కేసులంటే?

How many new cases are there in a single day?

0
119

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులతో పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్​లోనూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

ఒమిక్రాన్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉచితంగా 50 కోట్ల ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. బూస్టింగ్ డోసులు, రీడబుల్ వ్యాక్సినేషన్​ కోసం ఆస్పత్రులకు మద్దతు అందిస్తామని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్ తీసుకోవడం అందరి బాధ్యత. టీకా తీసుకోనివారిపై ఒమిక్రాన్ ప్రమాదకరమైన ప్రభావం చూపుతోంది. వైరస్​పై పోరాడి మనందరం అలసిపోయాం. దీనికి ముగింపు లభించాలనే కోరుకుంటున్నాం. కానీ మహమ్మారి ఇంకా అంతం కాలేదు. అయితే, ఇంతకు ముందుతో పోలిస్తే మనం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. దీన్నుంచి మనం బయటపడతాం అని జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.