Flash- సత్తా చాటిన యువ ఆటగాళ్లు..అండర్-19 ఆసియాకప్ భారత్ కైవసం

India wins Under-19 Asia Cup

0
83

అండర్-19 ఆసియాకప్ విజేతగా టీమ్​ఇండియా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా ఏడోసారి ఈ కప్​ను ముద్దాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 106/9 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్​ను 38 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత మరోసారి వర్షం పడటం వల్ల టార్గెట్​ను 102 పరుగులకు నిర్ణయించారు. దీంతో ఛేదన ప్రారంభించిన యువ భారత్.. 21.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసింది.