దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు..వారికి అవకాశం దక్కేనా?

Second Test against South Africa .. Do they have a chance?

0
157

దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్​ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో టెస్టుపై ఫోకస్ చేసింది.

న్యూఇయర్ సెలబ్రేషన్స్​ను ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు మళ్లీ ప్రాక్టీస్ బాట పట్టారు. అయితే ఈ టెస్టు కోసం యాజమాన్యం తుదిజట్టులో ఎవరికి చోటిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది. తొలి టెస్టులో గాయపడిన బుమ్రాను ఆడిస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. పుజారా, రహానే విఫలమవుతున్నా వారికి మరో అవకాశం ఇచ్చే వీలుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ మరోసారి బెంచ్​కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

రెండో టెస్టులో భారత జట్టు (అంచనా)

రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానే, పంత్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్

రెండో టెస్టు సోమవారం ప్రారంభంకానుంది. జోహన్నెస్​బర్గ్​ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాయి ఇరుజట్లు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది బీసీసీఐ.