టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఒక్కరోజు వ్యవధిలో మళ్లీ కొవిడ్ బారినపడ్డాడు. అయితే ఈ సారి అతడికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు సమాచారం. శనివారం రాత్రి చేసిన పరీక్షల్లో దాదాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా అంతకుముందే కరోనా బారిన పడిన గంగూలీ కోల్‌కతాలోని వుడ్లాండ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శుక్రవారం(డిసెంబరు 31) సాయంత్రం డిశ్చార్జి అయ్యాడు. అంతలోనే ఒక్కరోజు వ్యవధిలో దాదాకు మరోసారి పాజిటివ్‌గా తేలింది. అయితే కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉండటం వల్ల ఈ సారి ఇంట్లోనే ఐషోలేషన్‌లో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.