తెలంగాణలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించినందుకు ఓ యువతిని హత్య చేశాడు ప్రేమోన్మాది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..మన్నెంపల్లికి చెందిన వరలక్ష్మి ఇంటర్ చదువుతోంది. అప్పుడప్పుడు మేకలు మేపడానికి వెళ్ళేది. ఈ నెల 2న మేకలు కాసేందుకు వెళ్లిన వరలక్ష్మి ఇంటికి చీకటైన తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీనిపై ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు.
అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల్ పై అనుమానంతో పోలీసులు విచారించారు. బాలికను తానే హత్య చేశానని అఖిల్ అంగీకరించాడు. ఆమెను చంపి చెంజర్ల సమీపంలోని కాలువలో యువతి మృతదేహం పడేసినట్లు తెలిపాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చున్నీని గొంతుకోసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.