హీరో సిద్ధార్థ్‌ అసభ్యకర ట్వీట్..సైనాకు బహిరంగ క్షమాపణ

Hero Siddharth's obscene tweet..A public apology to Saina

0
103

ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ పలు వివాదాస్పద ట్వీట్​లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. అలాగే ఇప్పుడు కూడా  స్టార్ షటర్ల్ సైనా నెహ్వాల్​కు హీరో సిద్ధార్థ్ అసభ్యకర ట్వీట్ చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. కానీ చివరకు సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ చెప్పారు.

ట్వీట్ ద్వారా కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఓ లేఖను ట్వీట్ చేశారు. అది కేవలం ఓ జోక్ మాత్రమేనని, మనసును బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని రాసుకొచ్చారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని అన్నారు. ఇటీవల పంజాబ్​లో ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రధాని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన హీరో సిద్ధార్థ్.. అసభ్యకర రీతిలో సైనాపై కామెంట్ చేశారు. అది కాస్త పెద్ద దుమారమైంది.

కానీ ఇలాంటి చెత్త కామెంట్స్ చేసి, సారీ చెబితే సరిపోతుందా అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదికాక  సిద్ధార్థ్ ట్వీట్​పై సైనా కుటుంబ సభ్యులతో పాటు జాతీయ మహిళా కమిషన్​ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థ్ ట్విట్టర్​ ఖాతాను డిలీట్​ చేయాలని డిమాండ్ చేశారు.

https://twitter.com/Actor_Siddharth?