Breaking: టెన్నిస్‌కు సానియా గుడ్‌బై!

0
108

టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2022 తర్వాత రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్‌ ప్లేయర్‌..తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది.

స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, 6-7(5)తేడాతో ఓటమిపాలైంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. కాగా, ప్రస్తుతం డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకుంది