ఐసీసీ మహిళా టీ20 ర్యాంకింగ్స్​ విడుదల..షెఫాలీ వర్మ, స్మృతి ఏ స్థానంలో ఉన్నారంటే?

ICC Women's T20 Rankings Released

0
115

ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్​ విడుదల అయ్యాయి. ఇందులో టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షెఫాలీ వర్మ (726 పాయింట్లతో) మళ్లీ ఫామ్​లోకి వచ్చింది. స్మృతి మంధాన(709) ఓ స్థానం కిందకి పడిపోయి నాలుగో ర్యాంకులో నిలిచింది.

బెత్​ మూనీ(724), మెగ్​ లానింగ్​(714) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. శ్రీలంక ప్లేయర్​ చమారీ అటపత్తు(632) ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి టాప్​-10లోకి దూసుకొచ్చి ఎనిమిదో స్థానంలో నిలిచింది. బౌలింగ్ విభాగంలో దీప్తిశర్మ(658) నాలుగో స్థానంలో ఉండగా.. రాజేశ్వరి గైక్వాడ్​(637) పదో ర్యాంకులో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు సోఫీ ఎక్లీస్టోన్​(761), సారా గ్లెన్​(122) ఉన్నారు.

ఆల్​రౌండర్​ విభాగంలో దీప్తి శర్మ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 315 పాయింట్లతో మూడో ర్యాంకుకు చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో సోఫీ డివైన్​(న్యూజిలాండ్​, 370 పాయింట్లు) నటాలి సీవర్​(ఇంగ్లాండ్​,​ 352 పాయింట్లు) ఉన్నారు.