ఇండియాలో ఐపీఎల్ నిర్వహణపై గంగూలీ కీలక ప్రకటన

Ganguly's key statement on IPL management in India

0
103

ఇండియాలో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ టోర్నీ మొత్తం స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు. కానీ కరోనా కేసుల పెరుగుదల అంశంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్​ భారత్​లోనే నిర్వహిస్తాం. అయితే కరోనా విజృంభణ తారస్థాయికి చేరనంత వరకే. మహారాష్ట్రలోని ముంబయి, పుణెలో మ్యాచులు నిర్వహిస్తాం. నాకౌట్​ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం అని గంగూలీ పేర్కొన్నారు.

మరోవైపు ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం జరగనుంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.

ఇప్పటికే ఆయా జట్లు అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ తరుణంలో ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ చివరిదశ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు చెందిన ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో సిరీస్ దీనికి కారణం. మార్చి 27వ తేదీ నుంచి మే చివరి వరకు ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.