ఐపీఎల్ 2022: జట్టు పేరు ప్రకటించిన అహ్మదాబాద్

IPL 2022: Team name announced Ahmedabad

0
109

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నారు. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ ఏడాది లీగ్​లో అడుగుపెట్టిన కొత్త జట్లలో సీవీసీ గ్రూప్​.. అహ్మదాబాద్​ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. సంజీవ్ గోయంకా ఆర్​పీఎస్​జీ.. లక్నో ఫ్రాంచైజీని రూ.7090 కోట్లకు సొంతం చేసుకుంది. వీటిలో లక్నో టీమ్​కు ‘లక్నో సూపర్​జెయింట్స్’ అని పేరు పెట్టారు.

తాజాగా అహ్మదాబాద్​ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టారు.ఈ టీమ్​కు ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వహించనున్నాడు. ప్రీ ఆక్షన్​లో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్​మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది.