IPL 2022: ఆ మ్యాచ్​లకు స్టార్ ప్లేయర్స్ దూరం!

IPL 2022: Star players away for those matches!

0
104

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం జరగనుంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. లక్నో టీమ్​కు ‘లక్నో సూపర్​జెయింట్స్’ అని పేరు పెట్టగా..తాజాగా అహ్మదాబాద్​ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ అని పేరు పెట్టారు.

తాజాగా అభిమానులను నిరాశపరిచే ఓ వార్త బయటకు వచ్చింది. ​ఈ సీజన్​ ప్రారంభ మ్యాచ్​లకు చాలా మంది విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్​ కమిన్స్​, డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​, కగిసొ రబాడా(వెస్టిండీస్​), అన్రిచ్​ నోర్జే(దక్షిణాఫ్రికా), మార్కొ జాన్సన్​(దక్షిణాఫ్రికా) ఉన్నారని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్​ కోసం వీరు దూరం కానున్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్​ ప్రారంభంలో స్వదేశంలో ఐపీఎల్​ నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్​తో, దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్​తో సిరీస్​ ఆడనుంది. ఈ కారణంగా ఆ దేశ ఆటగాళ్లు తమ జట్టుకు అండగా ఉండేందుకు మెగాటోర్నీకి దూరంగా ఉండనున్నారని తెలిసింది.