సంతానం సాఫల్యం కలగాలంటే ఈ పప్పు తినాల్సిందే!

If the offspring are to be successful, they have to eat this lentil!

0
125

జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే.  జీడిపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.జీడిపప్పులో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. జీడిలో విటమిన్‌ ఇ, కె, బి6 పుష్కలం ఉంటాయి.ఇంకా క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. అలాగే జీడిపప్పు తినడం వల్ల మరో లాభం ఉంది. అదేంటంటే సంతానం లేనివారు తీసుకుంటే పిల్లలు కలుగుతారనే వాదన బలంగా వినిపిస్తోంది.

జీడిపప్పును ఎవరు తినాలి అనే అంశంపై స్పెయిన్‌ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా సంతానం లేని వారు తినడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నట్లు వారి విశ్లేషణలో తేలింది. వారి ప్రకారం.. జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్‌ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజూ గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెంది.. వాటి కదలికలు చురుగ్గా ఉంటాయి. వీర్యకణాల వృద్ధి అంతిమంగా సంతాన సాఫల్యానికి మార్గమని వారు చెబుతున్నారు.

కండరాల ఆరోగ్యం:

జీడిపప్పు లో మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఇది కండరాల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. అలానే ఇది అధిక రక్తపీడనాన్ని  తగ్గిస్తుంది. అలానే ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం వంటి మూలికలు జీడిపప్పు లో అధికంగా ఉన్నాయి

జుట్టు దృఢత్వానికి

జుట్టు నల్లగా ఉండాలి అంటే జుట్టు కి కాపర్ చాలా అవసరం. కాపర్ కలిగిన జీడిపప్పును తినడం వల్ల నల్లటి జుట్టు మీ సొంతమవుతుంది. నెరిసిన జుట్టుకు కూడా జీడిపప్పును తినడం వల్ల తగ్గించవచ్చు.

గుండెకి మంచిది:

ఇతర నట్స్ తో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో వుండే ఒలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కొవ్వు పదార్థాలు తక్కువగా మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం మూలాన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

బరువు

జీడిపప్పులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు దీనిలో ఉంటాయి. జీడిపప్పు తినని వారితో పోలిస్తే వారం లో రెండు సార్లు తినేవారు బరువు తగ్గుతారట.