ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. కాగా ఇప్పటివరకు ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలల్లోకి రాగా ఢిల్లీ, కేకేఆర్ అతడిని తీసుకోడానికి పోటీ పడ్డాయి. చివరకు కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు దక్కించుకుంది.
ఇప్పటివరకు వేలంలో మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోగా.. రెండో ప్లేయర్‌గా అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మూడో ప్లేయర్‌గా ప్యాట్ కమ్మిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 7.25 కోట్లకు, నాలుగో ప్లేయర్‌గా కసిగో రబాడ పంజాబ్ కింగ్స్‌కు రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయారు.
ఇక ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. రూ. 6.25 కోట్లకు మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో టీం డికాక్‌ను రూ.6.75 కోట్లతో దక్కించుకుంది.