Breaking: ఐపీఎల్ వేలంలో అపశృతి.. కుప్పకూలిన వేలం నిర్వాహకుడు

Disruption in IPL auction .. Collapsed auction manager.

0
91

బెంగ‌ళూర్ వేదిక‌గా ఐపీఎల్ మెగా వేలం జ‌రుగుతుంది. కాగా ఇప్పటివరకు ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలల్లోకి రాగా ఢిల్లీ, కేకేఆర్ అతడిని తీసుకోడానికి పోటీ పడ్డాయి. చివరకు కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు దక్కించుకుంది.

అయితే ఐపీఎల్ వేలంలో అపశృతి నెలకొంది. వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ వద్ద ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో అనుకోని పరిణామంతో వేలంను వాయిదా వేశారు. అతను ఆటగాళ్లందరిపై బిడ్లు నిర్వహించే సమయంలో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోవడంతో వేలాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు.