మోడీపై భగ్గుమన్న సీఎం కేసీఆర్..ప్రధానికి పిచ్చి ముదురుతోందంటూ కామెంట్స్

CM KCR lashes out at Modi

0
134

ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతోందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఆ పిచ్చితోనే రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. చెత్త పాలసీలు తీసుకువచ్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్థం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని తరిమి..తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఉత్తర ప్రదేశ్ లో రైతులను అన్యాయంగా కార్ల తొక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ ఉంటే మత తత్వాల తప్ప… అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా దేశాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఈ ఎనిమిది ఏళ్లలో మోడీ సర్కార్ చేసిందేమీ లేదని ఫైరయ్యారు సీఎం కేసీఆర్.