ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గిన కరోనా ఉధృతి..జిల్లాల వారిగా కేసుల వివరాలిలా..

0
120

ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. దీనితో ప్రజలకు ఊరట లభించింది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 24,066 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 896 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,694 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24454 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8,849 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  21

చిత్తూరు         52

ఈస్ట్ గోదావరి   206

గుంటూరు  141

వైస్సార్ కడప  23

కృష్ణ   130

కర్నూల్  23

నెల్లూరు   29

ప్రకాశం    73

శ్రీకాకుళం 08

విశాఖపట్నం  60

విజయనగరం 17

వెస్ట్ గోదావరి   113