ఫ్లాష్-ఫ్లాష్- రాహుల్ కి మద్దతుగా కేసీఆర్

0
38

ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..రోజులు గడుస్తున్నా కొద్ది ప్రధాని మోదీకి పిచ్చి ముదురుతోందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు.

కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసే సీఎం రాహుల్ గాంధీకి మద్దతివ్వడం సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ అనే ఓ ఎంపీ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.నాకు ఆయనతోని సంబంధం లేదు.కానీ వాళ్ల నాయనమ్మ, నాన్న ఈ దేశం కోసం చనిపోయారు పాపం. వాళ్ల తాత స్వాతంత్య్ర పోరాటం చేసి అనేక ఏళ్లుగా ప్రధానమంత్రిగా కూడా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఎంపీగా ఉన్నాడు.

రాజకీయాల్లో వున్నప్పుడు మాట్లాడుతాం. చర్చ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల తరపున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతారు. రాహుల్ గాంధీ ఏదో అడిగిండు. పార్లమెంట్ మెంబర్ గా ఉన్నరు కాబట్టి అడిగిండు. అడిగితే అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతడు ఆయన. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అని అడిగినమా అని అంటడు. నరేంద్ర మోడీజీ అస్సాం సీఎంను భర్తరఫ్ చేయండి. సీఎం అలా మాట్లాడొచ్చా. ఓపికకు కూడా హద్దులు ఉంటాయి. ఇంత అహంకారమా. ఎవరికీ అన్యాయం జరిగిన సహించం. బీజేపీ అట్టర్ ప్లాప్ పార్టీ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎప్పుడూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగే కేసీఆర్ ఉన్నట్టుండి రాహుల్ గాంధీపై బిజెపి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కేసిఆర్ మాట్లాడిన వీడియో కోసం కింద లింక్ చూడండి…

https://youtu.be/45ZbA8i_YYA