కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబరు 94ను విడుదల చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ ఎత్తివేసినా కొన్ని నిబంధనలు మాత్రం ఇంకా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. మాస్క్ ధరించని వారికి రూ. 10 వేల నుంచి 20 వేల వరకూ పెనాల్టీ విధించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.