వెస్టిండీస్‌తో జరుగుతున్న టి20ల సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలిచింది భారత్. ఇక ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది ఇండియా జట్టు. అయితే మూడో టీ20కు టీమ్ఇండియా బ్యాటర్ కోహ్లీ దూరం కానున్నాడు. అతడికి బయోబబుల్ నుంచి పది రోజుల పాటు విరామం ఇవ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ. అతడు తన ఇంటికి వెళ్లినట్లు పేర్కొంది. దీంతోపాటే శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడు దూరం కానున్నట్లు తెలిసింది.