Flash: టీమిండియాకు బిగ్ షాక్..శ్రీలంక సిరీస్ కు కీలక ఆటగాడు దూరం

0
91

వెస్టిండీస్ తో జరిగిన వన్డే,టీ20 సిరీస్ లు గెలిచి మంచి జోష్ మీద ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రేప‌టి నుంచి టీమిండియా, శ్రీలంక మ‌ధ్య టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు కీలక ప్లేయర్ అయిన దీపక్ చాహార్ దూరం కానున్నాడు. అటు బ్యాట్ తో ఇటు బాల్ తో మ్యాచ్ స్వరూపాన్నే  మార్చగలడు. ఇటీవ‌ల వెస్టిండీస్ తో జ‌రిగిన టీ20 సిరీస్ లో దీప‌క్ చాహార్ కు గాయం అయింది.  అయినా.. మూడో టీ20లో  దీప‌క్ చాహార్ ఆడాడు. అయితే ప్ర‌స్తుతం గాయం తీవ్ర‌త పెరిగిన నేప‌థ్యంలో దీప‌క్ చాహ‌ర్.. శ్రీ‌లంక సిరీస్ కు దూరం అయ్యాడు.