Flash: స్టార్ ప్లేయర్ కు పంజాబ్ కింగ్స్ పగ్గాలు..అధికారిక ప్రకటన

0
88

మార్చి 26 నుండి ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ జట్టు సారధిని నియమించే పనిలో పడ్డాయి. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ – 2022 కొత్త కెప్టెన్‌ ను నియామకం చేసింది. ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌, ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్‌ గా నియామకం చేస్తూ.. పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది.