కరోనా వ్యాధి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కరోనా వల్ల ప్రజలంతా ముప్పుతిప్పలు పడ్డారు. కరోనా వైరస్‌కు సంబంధించి పలు విషయాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, వాట్సప్‌తో పాటు ఇంటర్నెట్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇందులో కొన్ని నిజాలు కాగా చాలా అంశాలు నిరాధారమైనవే. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఘోరమైన వైరస్ కు సంబంధించిన కొన్ని వాస్తవాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ పరిశోధనాంశాలను విశ్లేషిస్తూ దీనికి సంబంధించి మరిన్ని అంశాలను వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే దీని పుట్టుక గురించి మాత్రం ఇప్పటి వరకు అనేక సందేహాలు అలాగే ఉన్నాయి. ఈ వ్యాధి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..?
2019 నవంబర్ చివర, డిసెంబర్ మొదటి వారాల్లో చైనాలోని వూహాన్ లో కరోనా వ్యాధి వ్యాప్తి ప్రారంభం అయింది. అనతి కాలంలోనే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారిన పడ్డాయి. అయితే తాజాగా ఈ వ్యాధి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వ్యాధి జంతువుల నుంచే వ్యాపించిందని నిపుణులు చెప్తున్నారు.అది ల్యాబ్ నుంచి పుట్టలేదంటూ తాజా అధ్యయాలు తేల్చాయి. వూహాన్ నగరంలోని సీఫుడ్ మార్కట్ నుంచే వ్యాధి వ్యాప్తి చెందినట్లు స్టడీలు తేల్చాయి.
కానీ నిజానికి ఏ జంతువు నుంచి వ్యాప్తించిందో రీసెంట్ స్టడీస్ ఖచ్చితంగా చెప్పలేకపోయాయి. అయితే వూహాన్ మార్కెట్ కేంద్రంగానే కరోనా కేసులు మొదలయ్యాయని స్టడీలో తేలింది. ముఖ్యంగా వూహన్ మార్కెట్ పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ కేసులు నమోదైనట్లు గుర్తించారు. చైనాలోని ప్రయోగశాల నుండి కరోనావైరస్ లీక్ అయిందనే సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా ధృవీకరించబడిన ఆధారాలు లేవని నివేదిక నిర్ధారించింది. వైరస్ ప్రకృతిలో నుంచే వ్యాపించిందని పీర్-రివ్యూ చేసిన అధ్యయనాలు గట్టిగా తెలుపుతున్నాయి.