ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

0
98

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలన్నీ ఒక్కొకటి రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్,రానా నటించిన భీమ్లానాయక్, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడి వంటి చిత్రాలు సందడి చేశాయి. మార్చి రెండో వారంలో మరిన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈటి:

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. అందుకు అనుగుణంగానే సూర్య సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి. ఇప్పటికే ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో విజయాలు అందుకున్నారు హీరో సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్నారు.

రాధేశ్యామ్‌:

అగ్ర కథానాయకుడు ప్రభాస్,పూజా హెగ్డే హీరో హెరాయిన్లుగా నటించిన చిత్రం రాధేశ్యామ్ . రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరులో ఏది గెలిచిందన్న ఆసక్తికరం. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్‌ కనిపించనున్నారు.

మారన్‌:

మరో తమిళ స్టార్ హీరో ధనుష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు ‘మారన్‌’ చిత్రంతో అలరించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రాబోతున్న ఈ తమిళ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించారు. మాళవిక మోహనన్‌ కథానాయిక. డిస్నీ హాట్‌స్టార్‌లో మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.