తెలంగాణను మరో పంజాబ్ గా మార్చొద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని.. కానీ గల్లీ గల్లీలో గంజాయి గుప్పు మంటుంది అని నేను అప్రమత్తం చేశానని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఆదర్శంగా ఉండాలని సినిమా పెద్దలను కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యవహారాలకు సినిమా వాళ్ళు తావివ్వకండి. మీరు తీసే సినిమాల ప్రభావం, చేసే పనులు తెలంగాణ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో కొంతమంది చేసే తప్పులు మొత్తం సినీ ఇండస్ట్రీని తప్పు పట్టేలా చేస్తాయి. మీరు రాజకీయ నేతలతో అలాయ్ – బలయ్ చేసుకోండి.. కానీ ఆలాయ్ బలయ్ ముసుగులో డ్రగ్స్ సేవిస్తే మాత్రం తాటా తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 12 నెలల్లో కాంగ్రెస్ అధికారం వస్తుంది. అప్పుడు డ్రగ్స్ కేసులో ఎవరున్నారో వారిని గుడ్డలు ఊడదీసి బరివాతన బజార్లో ఉరికించి కొడతాం.
గంజాయి, డ్రగ్స్ లో ఎంతటి వారున్న వారి వెనక ఎవడున్న, మీరెంత ప్రముఖ నటులైన, రాజకీయ నాయకులైన కూడా మార్చిలో మేము అధికారంలోకి రాగానే డ్రగ్స్ రిలేటెడ్ వ్యక్తులను పట్టుకుంటాం. ఈ గుట్కా, మట్కా, డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ అవుతుందని ప్రభుత్వాన్నిరేవంత్ రెడ్డి ప్రశ్నించారు.