కోపం తగ్గించుకోవడానికి ఐదు టిప్స్ చెప్పిన బాలయ్య..అవి ఏంటంటే?

0
117

అఖండ సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే బుల్లి తెరపై హీరోగా అలరించిన బాలయ్య బాబు.. తాజాగా ఆహా కోసం యాంకర్ గా మారారు. తనదైన శైలి తనతోటి నటీనటులను ఇంటర్వ్యూ చేస్తూ.. బుల్లి తెరపై కూడా సక్సెస్ అయ్యారు. తాజాగా ఈ షోలో కోపం తగ్గించుకోవడానికి 5 టిప్స్ చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

అవి ఏంటంటే..?

ఏదైనా చేసే ముందు.. ఎలా చేస్తామో.. కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టుకోవాలి.. ఒన్, టూ, త్రీ  అంటూ ఇలా నెంబర్స్ లెక్కపెట్టుకుంటే.. కోపం అదుపులోకి వస్తుందన్నారు.

క్షమించేస్తే.. సమరసింహా రెడ్డి కంటే గొప్పవారు కావచ్చు.. మనసులో ఏమి పెట్టుకోకుండా ఏది ఉంటే అది బయటపెట్టి క్షమించేయాలి.

ఎవరైనా సరే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. కోపంలో మీలో తేడా సింగ్ ను తీసుకొని రావద్దని చెప్పారు.

కోపం వచ్చిన ప్పుడు అసలు ప్రాబ్లెమ్ ఏమిటో తెలుసుకోవాలని.. అరుపులు కేకలు పెట్టకుండా అసలు ప్రాబ్లం ఏంటో ఆలోచించాలని చెప్పారు.

ఇది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది. తన కోపమే తన శత్రువు… తన శాంతమే తనకు రక్ష అని అన్నారు.  మీకోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ..  కోపం ఎక్కువ వస్తే మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడని చెప్పారు. ఈ టిప్స్ ఫాలోయితే బాగుపడటాని చెప్పారు.