రాధేశ్యామ్ ఓపెనింగ్స్..తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

0
43

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.ప్రేమ‌కీ, విధికీ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచాయి. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్ట‌కేల‌కు  ‘రాధేశ్యామ్‌’ నిన్న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా 7000 కు పైగా స్క్రీన్స్‌ లో విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో.. కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ప్రభాస్‌ కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా విడుదలకు ముందుగానే ఆన్‌ లైన్‌ టికెట్స్‌ బాగా అమ్ముడయ్యాయి.

యూఎస్‌ ప్రీమియర్‌ షోస్‌ ద్వార 891k డాలర్స్‌ వచ్చాయని సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. దాదాపు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఒక్క హైదరాబాద్‌ సిటీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ గ్రాస్‌ 6.5 కోట్ల మార్కును క్రాస్‌ చేసింది. ఇక పోతే… ప్రపంచ వ్యాప్తంగా 202.80 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది రాధే శ్యామ్‌ మూవీ.