IPL 2022- ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీ చూశారా? వీడియో

0
97

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి.  మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. ఒక్క బెంగళూరు తప్ప మిగతా అన్ని టీంలు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. తాజాగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది.

గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో కొత్త జెర్సీలో ఆడనుంది. ఈ మేరకు ఢిల్లీ యాజమాన్యం జెర్సీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్జ్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/1010231712922461