క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి.
తాజాగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. గత సీజన్లో ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి.
తాజాగా కేకేఆర్ జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ గా ఉన్న ఆరోన్ ఫించ్ ను కోల్ కత్త నైట్ రైడర్స్ ఫ్రొంఛైజీ తమ జట్టులోకి తీసుకుంది. బేస్ ప్రైజ్ కేవలం రూ. 1.5 కోట్లకే స్టార్ ఓపెనర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. కాగ ఇంగ్లాండ్ ఆటగాడు ఆలెక్స్ హేల్స్ స్థానంలో ఫించ్ ను తీసుకున్నారు కేకేఆర్.