ఎన్ని సీజన్లు వచ్చిపోతున్నా..ఎంతమంది సారథులు మారిన పంజాబ్ రాత మాత్రం మారడం లేదు. స్టార్లు అందుబాటులో ఉన్నా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న పంజాబ్ 2014లో ఫైనల్ వరకు రావడమే ఇప్పటిదాకా బెస్ట్ పెర్ఫామెన్స్. ఆ తర్వాత కింగ్స్ ఆట మరింత దిగజారింది. గత మూడు సీజన్లలో అయితే ఆరో స్థానానికి పరిమితమైంది. మరి రాహుల్ లేని పంజాబ్ కప్పు కొట్టగలదా? కొత్త సారధిగా మయాంక్ అగర్వాల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి? అలాగే జట్టు బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బలాలు:
బ్యాటింగ్ పరంగా శిఖర్ ధావన్, బెయిర్ స్టో, మయాంక్ అగర్వాల్, లివింగ్ స్టోన్‌తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక మిడిలార్డర్‌లో భనుక రాజపక్స, ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ ధాటిగా ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు.
బౌలింగ్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ, ఇండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
యంగ్ సెన్సేషన్ షారుక్ ఖాన్ ఏ మేర రాణిస్తాడో చూడాలి.
ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్‌ను రిటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
బలహీనతలు:
ఇతర జట్లతో పోలిస్తే పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉండడం.
రబడాకు ప్రత్యామ్నాయ బౌలర్ లేకపోవడం.
అనుభవం ఉన్న స్పిన్నర్ లోటు.
రవి బిష్నోయ్‌ను వదులుకోవడం.