కొత్త జట్టు కొట్టేనా కప్పు..లక్నో జట్టు బలం, బలహీనత ఇవే..

0
85

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి. అహ్మదాబాద్ జట్టుని రూ.5625 కోట్లకి సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని రూ.7090 కోట్లకి ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చేజిక్కించుకుంది. దాంతో.. ఇకపై 10 జట్లతో ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో తొలిసారి ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో? రాహుల్ సారథిగా కప్పు అందించగలడా? జట్టు బలం, బలహీనతల గురించి తెలుసుకుందాం..

కెప్టెన్‌.. వికెట్‌ కీపర్‌.. ఓపెనర్‌.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే ఆటగాడు ఓ వైపు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అదరగొట్టే ఆల్‌రౌండర్‌ మరోవైపు.. మణికట్టుతో మాయ చేస్తున్న స్పిన్నర్‌ ఇంకోవైపు.. ఇలా మెగా వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇక మెగా వేలంలో తమ దగ్గరున్న మొత్తం డబ్బు రూ.59 కోట్లను ఖర్చు పెట్టి మరో 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

బలాలు:

హోల్డర్‌ (రూ.8.75 కోట్లు), కృనాల్‌ పాండ్య (రూ.8.25 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు) లను వేలంలో దక్కించుకోవడం.

పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ (రూ.10 కోట్లు)ను భారీ ధరకు సొంతం చేసుకోవడం.

ప్రమాదకర డికాక్‌, లూయిస్‌, దుష్మంత చమీర ఉండడం.

బలహీనతలు:

రాహుల్‌ తర్వాత జట్టులో ప్రధాన భారత బ్యాటర్‌ లేకపోవడం లోటు.

మనీశ్‌ పాండే ఉన్నప్పటికీ అతనికి నిలకడలేమి సమస్య.

హోల్డర్‌, స్టాయినిస్‌, కృనాల్‌, దీపక్‌ రూపంలో హిట్లర్లున్నారు. కానీ క్రీజులో నిలబడి.. ఇన్నింగ్స్‌ను నిలబెడతారా?

పేస్ బౌలింగ్ లో ఆవేష్ ఖాన్ కు ప్రత్యామ్నాయం లేకపోవడం.

పేసర్‌ మార్క్‌ వుడ్‌ సీజన్ మొత్తానికి దూరమవ్వడం.