ఐపీఎల్: నేడు RCB- KKR ఢీ..బెంగళూరు బోణీ కొట్టేనా?

-

ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే 5 మ్యాచ్ లు జరగగా నేడు ఆరో మ్యాచ్  కోల్​కతా, బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ లో చెన్నైసూపర్​ కింగ్స్​తో తలపడి విజయం సాధించింది మంచి జోష్ లో ఉంది కోల్​కతా. ముంబయిలోని డీవై పాటిల్​ స్టేడియంలో బుధవారం సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్​ జరగనుంది.

- Advertisement -

 రాయల్​ ఛాలెంజర్స్ మెరుపులు మెరిపించేనా?

బెంగళూరు కెప్టెన్​ ఫాఫ్ డుప్లెసిస్​ మంచి ఫామ్​లో ఉన్నాడు. అతనే ఆ జట్టుకు కొండత బలం. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగిపోయిన విరాట్ కోహ్లీ కూడా ఎంతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్​ అనూజ్​ రావత్​, కీపర్​, దినేశ్​, కార్తీక్​ చివర్లో కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ నలుగురు బ్యాటర్లు చేలరేగితే మ్యాచ్ గెలిసినట్టే.

అయితే గత మ్యాచ్​లో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. గతేడాది పర్పుల్​ క్యాప్​ విజేత హర్షల్​ పటేల్​, శ్రీలంక స్పిన్నర్​ వనిందు నిరాశపరిచారు. కోల్​కతాను అడ్డుకోవాలంటే వారు రాణించాల్సిన అవసరం ఉంది.

కోల్​కతా జోరు సాగించేనా?

అజింక్యా రహానె ఫామ్​లోకి రావడం ఆ జట్టుకు శుభ పరిణామం. కెప్టెన్​ శ్రేయస్ అయ్యర్​, సామ్ బిల్లింగ్స్, జాక్సన్​.. మిడిల్​ ఆర్డర్ బాధ్యతల్ని స్వీకరించాలి. బౌలింగ్​లో ఉమేష్​ యాదవ్​ అద్భుత ప్రదర్శన చేసినా.. శివం మావి, స్పిన్నర్లు వరుణ్​ చక్రవర్తి, సునీల్ నరైన్​ గత మ్యాచ్​లో నిరాశపరిచారు. ఆల్​రౌండర్​ ఆండ్రూ రస్సెల్​ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడనడంలో సందేహం లేదు.

ఇప్పటివరకు కోల్​కతా, బెంగళూరు​ టీమ్స్ 29 సార్లు తలపడ్డాయి. అందులో కోల్​కతా​.. 16 మ్యాచుల్లో గెలవగా.. బెంగళూరు 13 మ్యాచుల్లో విజయం దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...