మనసు మార్చుకున్న సీఎం..కొత్త కేబినేట్‌లో వారికీ అవకాశం

0
103

ఏపీలో నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో 24 మంది మంత్రులు రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 11 వ తేదీన కొత్త కేబినేట్‌ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో.. పాత కేబినెట్‌లో ఎవరెవరిని కొనసాగిస్తారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

పాత టీమ్‌లో పది మంది సీనియర్లకు మళ్లీ చాన్స్‌ దక్కే అవకాశాలున్నాయి. పాత టీమ్‌లో ఒకరిద్దరికే అవకాశాలుంటాయని అంతా అనుకుంటున్న సమయంలో.. జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.