ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై మరింత భారం వేసేందుకు జగన్ సర్కార్ సిద్దపడింది. 2021-22 పెంచిన మొత్తం పన్నును 2022-2023 లోను మరో 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ ఇస్తామని పురపాలక శాఖ వెల్లడించింది.
కరోనా ప్రభావంతో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ చార్జీల మోతతో ప్రజలు కొంతకాలంగా నానాతిప్పలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో మళ్ళి ఆస్తి పన్ను పెంచి ప్రజలను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. దీనితో ప్రజలు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. త్వరలో అన్ని పుర, నగర పాలక సంస్థల్లో,నగర పంచాయతీల్లో పెరిగిన ఆస్తి పన్ను నోటీసులు జారీ చేయనున్నారు.