గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటిని వెలికితీసే పనిలో పడింది…. ఇప్పటికే స్పందన కార్యక్రమం ద్వారా అనేక అక్రమాలను బయటకు తీసిన సర్కార్ తాజాగా మరో అక్రమాన్ని బయటపడింది….
ప్రభుత్వ అండతో విజయవాడ మధురానగర్ లో టీడీపీ నేత ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబంకబ్జా చేసిన ప్రభుత్వం భూమిని ఏపీ రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు… ఈ భూమి సుమారు 200 కోట్లవిలువ చేస్తుంది.
గతంలో న్యాయస్థానాకి వాస్తవాలను తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు… అయితే ఇటీవలే స్పందన కార్యక్రమానికి అంధిన ఫిర్యాదు ద్వారా ఈ దందా వెలుగు చూసింది. స్థలంలో కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డును అధికారులు తొలగించి స్థలం గేటుకు నోటీసులు అతికించారు.