విజయవాడలో టీడీపీ వైసీపీల మధ్య బిగ్ ఫైట్

విజయవాడలో టీడీపీ వైసీపీల మధ్య బిగ్ ఫైట్

0
80

వినాయక నిమజ్జనం సందర్భంగా అధికార వైసీపీ నాయకుల మధ్య ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది… ఈ ఘర్షణ కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తేలప్రోలు గ్రామంలో చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా టీడీపీ నాయకులు వినాయకుడిని ఊరేగింపుతో తీసుకుని వైసీపీ నాయకులు కార్యాలయం వీధి గూండా వెళ్తున్నారు…

ఈక్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం ముదిరి కాసేపటికి ఘర్షణగా మారింది.. ఈ క్రమంలో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

గొడవను సర్దుమరిగించే క్రమంలో ఎస్సై తలకి గాయం అవ్వడంతో ఆయన్న ఆసుపత్రికి తరలించారు. ఈఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేతలు తమపై దాడి చేశారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.