మల్కాజిగిరి లో ఈనెల 18న గుడికి వెళ్లి అదృశ్యమైన ఉమాదేవి అనే మహిళకు ఎవరు హత్య చేశారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వినాయక గుడికి వెళ్ళి ఇంకా తిరిగిరాకపోవడంతో అతని భర్త ఆందోళనకు గురయ్యి మల్కాజిగిరి పోలీసులకు పిర్యాదు చేసాడు. అయితే ఈ ఘటనపై అసలు నిందితుడు ఎవరని పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఆ వ్యక్తి ఎవరో తెలిసింది.
నగలకు ఆశపడి పూజారి హత్య చేశాడని అని తేలడంతో అందరూ షాక్ కు గురయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు నిందితుడు పూజారి మురళిని పట్టుకున్నారు. అదృశ్యమైన రోజునే ఉమాదేవిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. అనంతరం మృతదేహాన్ని గురువారం స్వయంభు శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వెనుక ఉంచాడు. ఉమాదేవికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది.