ఐపీఎల్: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్.. రాయల్స్ నేడు రాణించేనా?

0
96

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 33 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 34 మ్యాచ్ లో తలపడానికి  ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్  రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం లో జరుగనుంది. ఈ సీసన్ లో రెండు జట్లు అద్భుతంగా రాణించాయి . మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

ఢిల్లీ క్యాపిటల్స్:  పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

 రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, ఆర్ అశ్విన్, ఒబెద్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్