Flash: యాదగిరిగుట్టలో ఘోర విషాదం..రెండతస్తుల భవనం కూలి నలుగురు స్పాట్ డెడ్

0
87

తెలంగాణ రాష్ట్రంలో ఘోర విషాదం నెలకొంది. రెండస్థుల భవనం కూలి నలుగురు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలు కావడంతో పాటు..మరికొందరు కూలిన శిథిలాలలో చిక్కుకుపోయారు. దాంతో గాయాలు అయిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ భవనం 40 ఏళ్ల కిందట నిర్మించారని స్థానికులు వెల్లడిస్తున్నారు.