క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే మరణించిన ఆసీస్ ప్లేయర్స్ రాడ్ మార్ష్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణాలు మరవకముందే మరో ప్రముఖ క్రికెటర్ మరణించారు. ఆస్ట్రేలియా జట్టులో దిగ్గజ క్రికెటర్ అయినా ఆండ్రూ సైమండ్స్ మృతి చెందడంతో ఐపీఎల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
అతను శనివారం రాత్రి 10.30గంటలకు క్వీన్స్‌లాండ్‌లోని అలైస్ రివర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న హెర్వే రేంజ్ రోడ్లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈయన మరణవార్త విన్న కొందరు క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కెరీర్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన సైమండ్స్ మృతితో ఆస్ట్రేలియా జట్టులో తీరని విషాదం చోటుచేసుకుంది.