ఢిల్లీ క్యాపిటల్స్ ‌పై ముంబై భారీ విజయం..

0
101

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 68 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 69 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోల్తా పడడంతో టీం మెంబెర్స్ అందరు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కెప్టెన్‌ పంత్‌ వ్యూహాత్మక తప్పిదం వల్లే జట్టు ఓటమి చవిచూడవలసి వచ్చిందని ఐపీఎల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించడంతో జట్టు సభ్యులు ఆనందంగా ఉన్నారు.

ముంబై బ్యాటర్లలో కిషన్‌(48),బ్రేవిస్‌(37), డేవిడ్‌ (34) పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పావెల్(43), పంత్‌(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, రమణదీప్ సింగ్ రెండు, సామ్స్‌, మయాంక్ మార్కండే తలా వికెట్‌ సాధించారు.