ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

0
92

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పసుపు పండించిన రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది.

కనీస మద్దతు ధర క్వింటాల్‌ రూ.6,850 చొప్పున రైతులకు చెల్లించేలా అన్ని ఎర్పాట్లు చేస్తునట్టు ప్రభుత్వం తెలిపింది. గత వారం, పది రోజులుగా మార్కెట్‌లో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

గతేడాదితో పోలిస్తే ఎగుమతులు ఈ ఏడాది 20% తగ్గడంతో ఏపీలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్టు తెలిపింది. రైతులకు కనీసం పెట్టుబడి కూడా పుడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,850కు కొనుగోలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.