వేసవి కాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు..జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తుంటుంది. చెమటలు పట్టడం, అధిక వేడి కారణంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని అందరికి తెలుసు.
వేసవి ఎండలకు సూర్యరశ్మి మరియు అధిక చెమటతో ఎక్కువగా బాధపడేవాటిలో తల ఖచ్చితంగా ఉంటుందని అందరికి తెలుసు. దీనివల్ల తలలో దురద ఎక్కువగా ఉండి మహిళలు ఇబ్బంది పడుతుంటారు. అధిక ధూళి, అపరిశుభ్రమైన తల చర్మం, సూక్ష్మక్రిములు, చుండ్రు, పేను ముట్టడి లేదా షాంపూ వాపు వంటి కొన్ని ఇతర కారణాల వల్ల కూడా దురద వస్తుంది.
అయితే తలలో దురద సమస్యను ఈ సింపుల్ చిట్కాలు పాటించి తొలగించుకోవచ్చు. ముఖ్యంగా మన జుట్టును పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు..చుండ్రు లేకుండా జాగ్రత్త పడాలి. ఇది కాకుండా ఒత్తిడి మరియు సరికాని ఆహారపు అలవాట్లు కూడా దురద వస్తుంటుంది. కావున మనం తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తల భాగంలో చెమట పట్టకుండా జాగ్రతలు తీసుకోవాలి.