ఘోరం..కదులుతున్న కారులో తల్లి, కూతుర్లపై గ్యాంగ్ రేప్

0
130

రోజురోజుకు స్త్రీలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కఠిన శిక్షలు వేసిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. వీరు చేష్టలకు మహిళలు కాక ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లో మరో దారుణం జరిగింది.

హరిద్వార్‌లోని రూర్కీలో ఓ మహిళ తన కూతురితో నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో కారులో అటు వైపు వెళ్తున్న యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం వక్రబుద్ధితో యువకులు కదులుతున్న కారులో తల్లి, కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఎట్టకేలకు వారి నుండి తప్పించుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తల్లీ, కూతురిని రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో చేర్పించి వైద్య పరీక్షలు జరిపించగా..అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.