గర్భవతులు చాక్లెట్స్ తినడం వల్ల లాభాలివే..

0
112

ప్రతి ఒక్క మహిళ జీవితంలో తల్లికావడమనేది ఓ అద్భుత వరం. అందుకే మహిళలు గర్భిణీలుగా ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా  ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే పిండం ఎదుగుదల తల్లి తీసుకునే ఆహారంపైనే ఆధారపడుతుంది.

గర్భధారణ సమయంలో జ్యూస్ లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ప్రేగ్నెన్సీ సమయంలో చాలామంది  గర్భిణీలకు చాక్లెట్  తినాలనిపిస్తుంది. కానీ చాక్లెట్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా అని సందేహపడుతుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో బరువును అదుపులో ఉంచడానికి చాక్లెట్‌ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రోజు కొంచెం డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే..చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గడంతో పాటు..చాక్లెట్ తింటే గర్భిణీల స్ట్రెస్‌ లెవల్‌ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గుతాయట. అందుకే గర్భిణీలు ప్రతిరోజు ఒక చాక్లెట్ తీసుకోవడం మంచిది.