ఇంతటితో ఆ కాపు టీడీపీ నేతకు ఎండ్ కార్డ్ పడిందిగా…

ఇంతటితో ఆ కాపు టీడీపీ నేతకు ఎండ్ కార్డ్ పడిందిగా...

0
90

టీడీపీ ఆవిర్భవం నాటినుంచి 2014 ఎన్నికల వరకు గెలుపు ఓటమిలను చవిచూసిన తమ్ముళ్లు… గతంలో ఎన్నడు లేని విధంగా 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెంది చరిత్రకు ఎక్కారు… 175 సెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కేవలం 23 స్థానాలను గెలిచుకుని స్వల్ప తేడాతో ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది…

ఎన్నికల తర్వాత టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్తు ముగింపు దశకు చేరుకుంది… ఇవే చివరి ఎన్నికలు అన్నట్లు పోటీ చేసిన టీడీపీ సీనియర్స్ ఉహించని విధంగా ఓటమి చెందారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా సీనియర్ గా ఉన్న కాపు నేత మండలి బుద్దప్రసాద్ రాజకీయం కూడా ఎండ్ కార్డ్ పడినట్లే అని అంటున్నారు…

ప్రస్తుతం ఆయన వయస్సు మీదపడుతుండటంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయాలని చూసినా వయస్సు సహకరించే స్థితిలోలేదని తమ్ముళ్లు అంటున్నారు.