UIDAI కొత్త రూల్..వాటికి లింక్ తప్పనిసరి!

0
107

ఆధార్‌కార్డు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంకు చెందిన ఏ సంక్షేమ పథకానికైనా పొందాలంటే ఆధార్ ఉండడం తప్పనిసరని అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం UIDAI జనన మరణ డేటాను ఆధార్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. దీని కింద ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకు తాత్కాలిక ఆధార్ నంబర్ జారీ చేయబడుతుంది. తరువాత అది బయోమెట్రిక్ డేటాతో అప్‌గ్రేడ్ చేయబడుతుంది. మరణాల నమోదు రికార్డును కూడా ఆధార్‌తో అనుసంధానిస్తారు. తద్వారా ఈ నంబర్‌ల దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ కారణంగా ఇప్పుడు ప్రతి వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు డేటా బేస్‌కు జోడించబడుతుంది..

పుట్టిన బిడ్డ నుంచి వారి కుటుంబం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా చేస్తుంది. దీని వల్ల సామాజిక భద్రత ప్రయోజనాలు ఎవరూ కోల్పోరు. అదేవిధంగా డెత్ డేటాతో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా నేరుగా బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పథకం దుర్వినియోగం నిరోధించబడుతుంది.. మరణించిన వ్యక్తి ఆధార్ కార్దులను వాడుతున్నారనే కేసులు ఇటీవల చాలానే వినిపించాయి. దాని పై సీరియస్ అయిన అధికారులు త్వరలో 2 పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు..