కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జులై 21న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. ఇప్పుడు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. జులై 21న తమ ఎదుట హాజరుకావాలని వెల్లడించింది.